వేద న్యూస్, జమ్మికుంట:
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం అర్ధ శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్ చార్జి ప్రిన్సిపాల్.. పట్టణంలోని బాలాజి చేనేత సహకార సంఘం కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఓ. కుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో చేనేత రంగం పోషించిన పాత్రను కొనియాడారు.
అర్ధ శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ కే. రాజేంద్రం మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. అనంతరం.. విద్యార్థులు, అధ్యాపకులు 40 మంది చేనేత కార్మికులకు ఫ్రూట్స్ పంపిణి చేసి.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
