వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో కొలువు దీరిన గణనాథుడు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్నారు. మంగళవారం వినాయకుడి నిమజ్జన యాత్రను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ.. గణపతిని గంగమ్మ ఒడికి తరలించారు. యువకులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుల శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ యాత్ర అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.