వేద న్యూస్, కరీంనగర్:
వృత్తిలో భాగంగా ఓ గీత కార్మికుడు తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు తీసే క్రమంలో మోకు జారీ ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్రగాయాలైన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మ్యాడగోని మొగిలి సోమవారం గ్రామంలో తాటి చెట్టు ఎక్కాడు. చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు మోకు జారి పడగా తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గీత వృత్తిపైన ఆధారపడి జీవించే ఒక నిరుపేద గౌడ కుటుంబానికి చెందిన వ్యక్తికి తీవ్రగాయాలపాలై ఆస్పత్రికి వెళ్లారని, అతని కుటుంబ పోషణకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని వీణవంక సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు తిప్పని సమ్మయ్య గౌడ్ కోరారు.