- కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి, ముప్పిరి తోట ఎలిగేడు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి కోడలు సవితా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎలిగేడు మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి..మరోసారి మనోహర్ రెడ్డిని గెలిపించాలని సవితా రెడ్డి ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని జనాన్ని అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి రేణుక, ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు, లక్ష్మి, రామ్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రాజేశం , మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.