వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2003-2006 బీకామ్ డిగ్రీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల లెక్చరర్స్ డాక్టర్ చంద్రమౌళి , ఎన్ సీసీ కెమిస్ట్రీ లెక్చరర్ చంద్రమౌళి , కామర్స్ లెక్చరర్ లింగారెడ్డి , విజేందర్ రెడ్డి , ప్రవీణ్ కుమార్ హాజరు కాగా, వారిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్ అప్పుడున్న పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులను నెమరు వేసుకొని ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ స్నేహబంధాన్ని పెంచుకోవాలని, అందరూ ఏ స్థాయిలో ఉన్న ఒకరినొకరు తోడ్పాటు అందించుకొని ఉండాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1982 సంవత్సరంలో ఆదర్శ డిగ్రీ కళాశాల గా ఏర్పడి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిగ్రీ కళాశాలగా మార్చుకొని ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, లాయర్లుగా, ఉద్యమకారులుగా, విద్యావేత్తలుగా తయారుచేసి వివిధ రంగాల్లో వారు నైపుణ్యం సాధించుకుంటున్నారని జమ్మికుంట డిగ్రీ కళాశాల చరిత్ర పూర్వపరాలను లెక్చరర్లు వివరించారు.
కార్యక్రమంలో విద్యార్థులు కొలువురు సురేష్, వడ్లూరి కిషోర్, మైనర్, కిరణ్, హజరత్ పాషా, జగన్, శ్రీకాంత్ తహేర, అలియాంజ్, అఖండేశ్వరి, అలువేని, నసీమా, రమ్యకృష్ణ లతోపాటు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.