వేద న్యూస్, కరీమాబాద్:
పురాతన పండుగలను విస్మరించొద్దని ఆధునిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో ప్రజలు పురాతన పండుగలను విస్మరించకుండా జరుపుకోవాలని కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అన్నారు. భక్తి గీతాలు, భక్తుల కోలాహలం మధ్య కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన ఉత్సవాలు మొదలయ్యాయి.
బొడ్రాయి పున ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా సోమవారం వేదపండితులు యాగం నిర్వహించి గ్రామస్తులతో హోమం జరిపించారు.
ఈ సందర్భంగా కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మాట్లాడుతూ
గ్రామాల్లో కులదేవతలకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మత ధర్మం వ్యక్తి సన్మార్గానికి దారి చూపుతుందని పేర్కొన్నారు.