• సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్

వేద న్యూస్, మరిపెడ :

సాటి మనిషికి సహాయం చేయడమే భగవంతునికి అన్నింటికన్నా ఇష్టమైన సేవ అని, సహాయం కావలసిన వారిని గుర్తించి సహకరించాలని సత్యసాయిసేవాసమితి కురవి మండలకన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో శ్రీసత్య సాయిసేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరాధన ఉత్సవాల్లో భాగంగా నారాయణసేవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కురవిలోని శ్రీవీరభద్రస్వామివారి దేవాలయం వద్ద సుమారు 150 మందికి పులిహోర, పండ్లు,మజ్జిగప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, సత్యసాయి బోధించిన పవిత్రమార్గం అదేనని తెలిపారు.

శ్రీసత్యసాయిసేవాసమితి కురవిశాఖ ఆధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి తిరుమలరావు, లక్ష్మి, యశ్వంత్, కర్నాటి మోహన్ రావు, నాగమణి, సరిత, నవ్య, స్వరూప,మల్లేశ్వరి, మంజుల, రమాదేవి,లలిత, సాయి, వేమిశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.