•  ఔదార్యాన్ని చాటుకున్న డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గౌస్ హైదర్

వేద న్యూస్, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం కాసింపల్లికి చెందిన ఒక నిరుపేద విద్యార్థిని సయ్యద్ సబ్జాన్ బి (తండ్రి పేరు సయ్యద్ హుస్సేన్) పుట్టుకతోనే రెండు కాళ్లు మెలి తిరిగి పుట్టడంతో నడవడానికి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి. అయినా కూడా చదువుపై ఉన్న మమకారంతో కుంటుకుంటూనే ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు కుంటుకుంటూనే కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కు వెళ్తుంది.

ప్రస్తుతం ఈ విద్యార్థిని 7వ తరగతి చదువుతుంది. ఈ విషయం తెలుసుకున్న డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గౌస్ హైదర్ మానవత్వంతో స్పందించి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, ఎఫ్ ఆర్ వో రవికృష్ణ లతో మాట్లాడి విద్యార్థినికి వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.

డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గౌస్ హైదర్ మానవత్వంతో స్పందించిన తీరు పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు, అధికారులతో పాటు పలువురు గౌస్ హైదర్ పై, తమ దృష్టికి వచ్చిన వెంటనే వీల్ చైర్ ఏర్పాటు చేసి అందించిన డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, ఎఫ్ ఆర్ ఓ రవి కృష్ణ లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.