• తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి తీర్మానం
  •  త్వరలో తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అందజేస్తామని ప్రకటన

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి:
బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ తెలంగాణ ఉద్యమనేత ఆర్‌వీ మహేందర్ కుమార్ కు కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నాయకులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఎల్బీనగర్‌లోని ఎస్కే గార్డెన్ లో సమావేశమయ్యారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో..గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఆర్‌వీ మహేందర్ కుమార్ కు కేటాయించాలని కోరుతూ ఉద్యమకారులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

23 ఏళ్లుగా గులాబీ పార్టీ కోసం పని చేస్తోన్న నాయకులు ఆర్ వీ మహేందర్ అని నాయకులు అభిప్రాయపడ్డారు. గోషామహల్ లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ఆర్ వీ మహేందర్ కే టికెట్ ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నాయకులు రూబీ స్టీవెన్సన్, గంధం రాములు, కాచం సత్యనారాయణ, ఆర్ వీ మహేందర్ కుమార్, వెంకన్న, ఎర్రోజు శ్రీనివాస్, కోట్ల సువర్ణ, మహేందర్ రెడ్డి, రామచందర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ ప్రభు గౌడ్, శోభ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.