- ఆర్టీఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చంటి ముదిరాజ్
వేద న్యూస్, వరంగల్ టౌన్:
పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చంటి ముదిరాజ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ వరంగల్- ఖమ్మం -నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయని సెప్టెంబర్ 1, 2020 వరకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతైన వారు ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు.
గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా నమోదై ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ ఇప్పుడు ఆ ఓటరు జాబితా చెల్లదని కావున అర్హత కలిగిన వారందరూ ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని ఫారం 18 ద్వారా కానీ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ లో గాని నమోదు చేసుకోవాలన్నారు.