- మాజీ ఎంపీపీ వంగాల నారాయణ రెడ్డి
వేద న్యూస్, శాయంపేట :
యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మాజీ ఎంపీపీ వంగల నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం శాయంపేట లో నిర్వహించిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎగిసే ఉత్సాహం, ప్రతిభ, ఏదైనా సాధించగల కార్యదీక్షత, బావి భారత నిర్మాతలైన యువత సొంతం అని పేర్కొన్నారు. ఏదైనా చేయగల యువత దేశానికి ఒక వరం వంటిదన్నారు. పని దొరకని, పని రానీ యువత దేశానికి ఒక రకంగా విపత్తు లాంటిదని పేర్కొన్నారు.

మరో ముఖ్య అతిది ఎస్సై పరమేష్ మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న యువత గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. దేశ అభివృద్ధికి యువత మారడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులున్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత యువతరానిదే అని చెప్పారు. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలను ఏ రంగంలో ఉన్నాయో చూసుకునే బాధ్యత యువతదేనన్నారు.
విశిష్ట అతిథి, మాజీ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లెక్కల జలెందర్ రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగంలో రాణించి ఆర్థిక అభివృద్ధి సాధించడంతోపాటు పలువురికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు ఎదగాలన్నారు. అందుకు యువత మేలుకోవాలని చెప్పారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
అలాగే గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్య్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గిద్దేమరి సురేష్, వక్త కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ డైనంపల్లి సుమన్, కాంగ్రెస్ గ్రామశక అధ్యక్షుడు చింతల రవిపాల్, మాజీ సర్పంచ్ లు వలుపదాసి చంద్ర మౌళి, ఇమ్మదిశెట్టి రవీందర్, బీజేపీ మండలద్యక్షుడు రామ కృష్ణ, జిల్లా నాయకులు విద్యాసాగర్, నాగరాజు, నవీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.