వేద న్యూస్, ఆసిఫాబాద్:
ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ‘‘జై జవాన్, జై కిసాన్’’ అని నినదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్న, విద్యాసాగర్, జ్యోతి, గ్రామస్తులు దాదాజి, సాంబయ్య, అరుణ్, ప్రకాష్ తదితరులున్నారు.