• మంత్రి సీతక్కకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర విన్నపం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హైదరాబాద్:

భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సెక్రటేరియట్ లోని మంత్రి సీతక్క ను ఆమె ఛాంబర్ లో ఎమ్మెల్యే గండ్ర మర్యాద పూర్వకంగా కలిశారు.

అనంతరం భూపాలపల్లి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధిపై కొద్దిసేపు చర్చించారు. నియోజకవర్గంలో పలు రోడ్లకు నిధులు వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే విన్నపంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం వీరేందర్ తదితరులు ఉన్నారు.