• ఘనంగా మహిళా దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట:
మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాణి, మహిళా సిబ్బందిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా తహసీల్దార్ రాణి పిలుపునిచ్చారు. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు అన్నింటా స్త్రీలు సత్తా చాటాలని సూచించారు.