వేద న్యూస్, జమ్మికుంట :

జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ఆస్పత్రిలో మహిళలకు ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించారు. ఈ క్యాంప్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ హేమలత హాజరై శిబిరాన్ని ఆస్పత్రిలో ప్రారంభించారు. సంజీవని ఆస్పత్రి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఎం.ప్రణీత, యూ.అనిత ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

దాదాపు 300 మంది ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మహిళల కోసం ఉచిత శిబిరం నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా మహిళలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ‘సంజీవని’ ఆస్పత్రి వైద్య సిబ్బంది, వైద్యులు డాక్టర్ ఎం.సురేశ్, డాక్టర్ యు.సురేశ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొని క్యాంప్ ను విజయవంతం చేశారు.