వేద న్యూస్, బోయినిపల్లి :

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరిత సేనలో పాల్గొని స్తంభంపల్లి గ్రామంలోని వాటర్ ప్లాంట్, పక్కన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి వేప మొక్కలు,నాటిన మాజీ సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి కరుణాకర్,మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, కార్యక్రమంలో భాగంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆధ్వర్యంలో చేపట్టిన హరిత హారం, కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు, నాటించి పచ్చని వాతావరణాన్ని, ఏర్పరిచారని తెలిపారు.అదే స్ఫూర్తితో, తమ గ్రామంలో కూడా వేలాది మొక్కలు నాటి, పచ్చని చెట్లతో అభివృద్ధి,చేయాలనే ఉద్దేశం తో కృషి చేస్తున్నామని, చెప్పారు. అలాగే జోగినిపల్లి సంతోష్ కుమార్, చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ద్వారా పుట్టిన రోజు, పెళ్లి రోజు, వంటి ప్రతి శుభకార్యం,లో ఒక మొక్క నాటాలని,ప్రజలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా  తమ పుట్టిన రోజు, సందర్భంగా బిఆర్ఎస్, నాయకులు, మరియు గ్రామ ప్రజలతో, కలిసి వేప మొక్కలు, నాటినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గంటి శంకర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, తొంటి మధుకర్, తదితరులు మరియు స్తంభంపల్లి గ్రామ యువకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *