• మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి నవీన్ రావు రాజీనామా
    వేద న్యూస్, మరిపెడ:
    మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి నవీన్ రావు మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది కార్యాలయంలో వీడ్కోలు పలికారు. నవీన్ రావు.. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మించి జిల్లాకే వన్నె తెచ్చారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా గ్రంథాలయాన్ని నవీన్ రావు తన హయాంలో తీర్చిదిద్దారని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్ధం సకల సౌకర్యాలతో ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా స్టడీ మేటియల్స్ ను సమకూర్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.