- ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి ఔదార్యం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, అను రాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్అనితా రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. హన్మకొండలోని స్వదార్ ఆశ్ర యములో అనురాగ్ చేయూత , బాలికా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళల జీవితానికి భరోసా కల్పించడానికి కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పావని అనే అమ్మాయికి ఉచితంగా ఉష కుట్టు మిషన్ ను , సంస్థకు బియ్యం బస్తాలు, కంది పప్పు, ఫ్రూట్స్ అందజేశారు.
అనంతరం జెండర్ ఈక్వాలిటి, బాలికల ప్రాముఖ్యత, మహిళ సాధికారత అంశాలపై పైఅవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన ఉంటేనే చట్టాలను వినియోగించు కోగలుగుతారని , ప్రశ్నించేతత్వాన్ని అలవరచు కోవాలని సూచించారు. తమ హక్కు లను కాపాడు కోవాలని చెప్పారు. మహిళ లు స్వయం ఉపాధి శిక్షణ లలో రాణించి..ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే స్తాయిలో ఉండాలని స్పష్టం చేశారు. జీవితం లో వచ్చిన కష్టాలను మరిచిపోయి పాజిటివ్ థింకింగ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి , శైలజ తదితరులు పాల్గొన్నారు.