వేద న్యూస్, డెస్క్:

ఈ హోలికి కొత్త కొత్త రంగులతో కొత్తధనానికి మరిన్ని విజయాలకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర  రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం అందరికీ హోలీ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరూ బేధ భావాలు వీడి పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా మోదుగు పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో వసంత కాలానికి నాందిగా మొదలైన హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు.. సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను జరుపుకోవాలని, పరస్పర ప్రేమ, సహృద్భావం, ఆప్యాయతలతో హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిగురించే ఆశలతో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోకి కొత్తదనాన్ని ఆహ్వానించే హోలీ పండుగ భారతీయ సంప్రదాయమని ఇది ఎంతో అందంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించి హోలీ పండుగను జరుపుకోవాలని , పిల్లలకు పెద్దలు దగ్గరుండి జాగ్రత్తలు చెప్పాలని, రంగులు కళ్ళల్లో పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల జీవితాల్లో నూతనోత్తేజం నింపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.