వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు అబ్బూరి సునీల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు గణితం ద్వారా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గణితం కు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

 

ఈ సందర్భంగా పాఠశాల గణిత ఉపాధ్యాయులు విజయలక్ష్మి, మేరీ షీలా, ప్రసాద్ ను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, రంగోలి, క్విజ్, చిత్రలేఖన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మురళీకృష్ణ, భూమా వెంకటేశ్వర్లు, జేవియర్, శ్రీశైలం, ఇందిరా, కేదారి, అనురాధ, శంకర్, ప్రేమ్ సాగర్, హరి, మధుకర్, రాజకుమారి, వెంకన్న, సురేష్, సఫియా బేగం, ఉమాదేవి, హరినాథ్ బాబు, భద్ర వెన్నెల తదితరులు పాల్గొన్నారు.