వేద న్యూస్, శాయంపేట :
తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ అందరి కుటుంబాలల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హన్మకొండ లోని వారి స్వగృహం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందన్నారు. కాగా, సంక్రాంతి కానుకగా రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నదని తెలిపారు. ఈ మూడు హామీలను ఈనెల 26 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుడిపాల బుచ్చిరెడ్డి మండల బోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షల తెలిపారు.విరివెంట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవీపాల్, నాయకులు చిదం రవి, బాసనీ మార్కండేయ, బాసని రవి, మరపెల్లి కట్టయ్య,రాజు,ఐఎన్ టియుసీ అధ్యక్షుడు మరపెల్లి రాజేందర్ పాల్గోన్నారు.