– ఊరు దాటితేనే ఊరంత మెచ్చుకునే స్థాయికెదుగుతావు
– కేరీర్ మొదట్లో ఉద్యోగం చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు
– నచ్చిన రంగంలో మొదటి అడుగు ఆలోచించి వేయాలి ముందుకు
– మన దేశానికి పట్టు యువత .. మీరే ఈ దేశ తలరాతలు
– సిద్ధిపేట మహిళ జాబ్ మేళా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు
వేద న్యూస్, సిద్ధిపేట :
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జరిగిన మహిళా జాబ్ మేళా కార్యక్రమంలో సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “కేరీర్ మొదట్లో ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో ఎవరూ కూడా ఎదుటివారు చిన్న ఉద్యోగం చేస్తున్నారని చులకన భావంతో చూడవద్దు..ఉన్న ఇంటి గడపను దాటి బయటకు అడుగు పెట్టండి..అప్పుడు మన తలరాతలు మారతాయని అని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నీకు నీవు నీ కాళ్ళమీద నిలబడ్డప్పుడు మాత్రమే ప్రశ్నించగలుగుతావు..నీస్వశక్తితో నువ్వు బ్రతకగలుగుతావు అని మహిళలకు మనోధైర్యాన్ని కలిగించేలా మాట్లాడారు.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ ఎవరైన తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలనుకున్నప్పుడు తొలి అడుగుతోనే ప్రారంభిస్తారు. ఎన్నో విజయగాథలను చూసి, అనుభవంతో నేను చెబుతున్నాను.
మా తరానికి.. తరతరాలకు ఆదర్శమైన రతన్ టాటా, బిర్లా వంటి పెద్ద పెద్ద బిలినీయర్లు చిన్నచిన్న జాబ్లతోనే తమ జీవితాలను ప్రారంభించారు. చిన్న ఉద్యోగమైనా నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, ఇది మీకు జీవితంలో మొదటి అడుగు మాత్రమే. ఇందులో నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి.. అవి సిద్దిపేట పిల్లలకు రావాలనేది నా ఆలోచన. జాబ్ మేళ ద్వారా జీవితంలో ముందుకు సాగాలి అని ఆయన పేర్కొన్నారు.