వేదన్యూస్ – హైదరాబాద్
కంచ గచ్చిబౌలి లోని భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్ సీయూ భూములపై ఇచ్చిన మధ్యాంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అక్కడ ఎలాంటి పనులు చేయద్దు.
చెట్లను మొక్కలను నరికే పని అసలు చేయద్దంటూ విచారణను ఈనెల పదహారు తారీఖుకు వాయిదా వేసిన సంగతి మనకు తెల్సిందే. ఈ క్రమంలో యూనివర్సిటీ భూముల్లో జేసీబీలు పనులు చేస్తుంటే వాటీ ముందు నెమళ్లు, జింకలు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ ఫోటో ఏఐ తో క్రియేట్ చేసిందని అధికార కాంగ్రెస్ పక్షం వాళ్లు వాదిస్తున్నారు.
కాదు అది నిజమైందే అని ప్రతిపక్షం వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తెగ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోహాన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటో గురించి స్పందిస్తూ అత్యాద్భుతమైన ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ ను పట్టిస్తే పది లక్షల రూపాయల రివార్డును అందిస్తాము అని ప్రకటించారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు.
https://x.com/DrCRohinReddy/status/1907686784416301194/photo/1