- మిడిల్ క్లాస్ కు అందుబాటులో పాలసీలు
- టాటా ఏఐజీ ఇండియా హెడ్ నరేందర్, సౌత్ ఇండియా హెడ్ ప్రసాద్
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని స్థానిక టాటా ఏఐజీ జమ్మికుంట ఎస్ఏ ఆఫీసును అధిపతులు ఇండియా హెడ్ నరేందర్ నాగి, సౌత్ ఇండియన్ హెడ్ ప్రసాద్ శెట్టి గురువారం సందర్శించారు. ఈ సంద్భంగా ఏజెంట్స్ ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ టాటా ఏఐజీలో మిడిల్ క్లాస్ ప్రజలకు కుడా అందుబాటులో ఉండే విధంగా పాలసీలు ఉన్నాయని చెప్పారు.
ప్రతీ ఒక్క కుటుంబానికి పాలసీలు అందించి వారి కుటుంబాలకు అత్యవసర పరిస్థితిలో ‘‘వారికి మేమున్నాం’’ అంటూ టాటా ఏఐజీ పాలసీని అందుబాటులో ఉంచి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరారు. అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు.
కనీసం ఒక ఫ్యామిలి కి 15 వేల నుండి 25 వేల వరకు ఉండే ప్రీమియంతో సంవత్సరనికి 20 లక్షల వరకు సహాయం అందుతుందని వివరించారు. సౌత్ ఇండియన్ హెడ్ ప్రసాద్ శెట్టి మాట్లాడుతూ ప్రతీ గ్రామీణ ప్రాంతానికి టాటా ఏఐజీని విస్తరించి ప్రతీ సామాన్య కుటుంబానికి అందుబాటులోకి తేవాలని సూచించారు. తద్వారా కుటుంబానికి ఆర్థిక రక్షణ తో పాటు ఏజెంట్స్ కు స్వయం ఉపాధి కలుగుతుందని వెల్లడించారు. ప్రతీ గ్రామంలో ఇదే విధంగా ప్రాంతీయ ఆఫీస్ ప్రారంభించే విధంగా ఏజెంట్స్ తమ వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధిపతులను జమ్మికుంట ఎస్ఏ బ్రాంచ్ హెడ్ శ్రి గందె దెవర్షిని ప్రవీణ్ కుమార్, ఏజెంట్స్ ఘనంగా సన్మానించారు. ఈ ఆఫీస్ ను 15 రోజుల కిందట ఏపీ, తెలంగాణ హెడ్ రామకృష్ణ రెడ్డి, జోన్ క్లస్టర్ హెడ్ వివేకానంద ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ హెడ్ రామకృష్ణ రెడ్డి , క్లస్టర్ హెడ్ వివేకానంద, వరంగల్ బ్రాంచ్ మేనేజర్ చందా రాము, జమ్మికుంట ఎస్ఏ బ్రాంచ్ హెడ్ గందె ప్రవీణ్ కుమార్, ఏజెంట్స్ పాల్గొన్నారు.