వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమురం భీమ్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ , కాఘజ్ నగర్ కీర్తి డెంటల్ ఆసుపత్రి సహకారంతో, దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో కనక దుర్గాదేవి స్వయంభూ మహంకాళీ దేవస్థానం వద్ద ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.
అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ఉచితంగా అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో దేవార వినోద్ స్వామి జోనల్ చైర్మన్ రౌతు వెంకటేశం, గొలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ కార్యదర్శి అన్న రమేష్, కోశాధికారి చందర్, సహదరుడు వంగా మహేందర్, కె.భాస్కర్, సత్యనారాయణ, దంత వైద్యురాలు కీర్తి, కాంతి వైద్యులు అంజయ్య దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.