= ప్రధానోపాధ్యాయురాలు రజిత
= పాఠశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

వేద న్యూస్, చందుర్తి:
చందుర్తి మండలంలోని అసిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రజిత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రోల్ ప్లే నిర్వహించి కిడ్నీల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలని, రక్తంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే పని చేస్తాయని తెలిపారు. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపతి రమేష్, అర్చిత, తిరుమల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *