వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ , పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డా.వి. రాణి మాట్లాడుతూ ఋతు పరిశుభ్రత పాటించకపోతే అనేక ఇన్ఫెక్షన్స్ కి దారితీసి క్యాన్సర్ కి కారణం కావచ్చన్నారు. పాఠశాల, కళాశాలలలో చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారని తెలియజేశారు.
HPV వ్యాక్సిన్ (హ్యుమన్ పాపిల్లోమా వైరస్) గురించి వివరిస్తూ గర్భధారణ సమయంలో ఉత్పత్తి అయ్యే హ్యమన్ క్రోనికల్ గొనాడో ట్రోపిన్ (HCG) అనే హర్మోన్ను లక్ష్యంగా చేసుకునే ఒక రకమైన సంతానోత్పత్తి నియంత్రణ టీకా అని తెలియజేశారు. ముందుగా జరిగే ఋతు చక్రం గురించి కూడా వివరంగా తెలియజేశారు. PCOS అనేది హార్మోన్ల రుగ్మత, క్రమరహిత ఋతుక్రమం, మెటిమల వంటి లక్షణాలను కలిగిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపాల్ డా.ఎస్. ఓదెలు కుమార్, డా. కె. రాజేంద్రం, డా. మాధవి, ఉమాకిరణ్, డా. సుష్మ, మమత, అనూష, రమేష్ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
అప్రమత్తతే మేలు.. ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్