• వేద న్యూస్, గీసుకొండ : 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాటికొండ విమల అనారోగ్యంతో మరణించగా అంత్యక్రియల ఖర్చుల సహాయార్ధం గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి రూ.5000ల ఆర్థిక సహాయాన్ని పంపగా అట్టి నగదును మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి కూడా మరొక రూ.5000ల ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుమారునికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి దౌడు భరత్, స్థానిక పెద్దలు చాడ సంజీవరెడ్డి, బోడకుంట్ల కుమారస్వామి,కందికొండ మొగిలి,కర్ణకంటి సత్యనారాయణ, బ్రహ్మచారి, కోటి, బెజ్జెంకి బ్రహ్మయ్య, బిక్షపతి ఆచార్యులు, పోలీసు బాబూరావు, తాటికొండ నరేందర్, శంకర్ , వేముల నరేందర్ రెడ్డి మరియు చినగారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *