వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో ముందస్తుగా భారతీయ హిందీ దివస్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత రాజభాష అయిన హిందీని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ ను జరుపుకుంటారని వారు అన్నారు. హిందీ ఉపాధ్యాయులు, హిందీ భాష దేశానికి ఎంత కీలకమో వివరించారు. అలాగే భిన్న భాషలను గౌరవిస్తూ, భారతీయ సంస్కృతి మరియు ఐక్యతను కాపాడేందుకు హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు.

 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల హిందీ ఉపాధ్యాయులు సురేష్ మరియు అనిత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు హిందీ భాష ప్రాధాన్యతపై ఉపన్యాసాలు, కవిత్వం, వ్యాస రచన, చిత్రలేఖనము, నృత్యాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు హిందీ భాషపై ఆసక్తిని పెంచుకొని, దేశభక్తిని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం పొందారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం దేవుల, నెహ్రూ, సుధా, భువనేశ్వరి, పద్మ, శంకర్, సుజాత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.