వేద న్యూస్, ఎలిగేడు:

త్వరలో ఎలిగేడు మండలవ్యాప్తంగా ఉన్న గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైతున్న  నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున గులాబీ జెండా నీడకు వస్తున్నారని వివరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలవ్యాప్తంగా బీఆర్ఎస్‌లోకి వలసల పరంపర కొనసాగుతుందని, ఎలిగేడు మండలం గులాబీమయం అవుతుందని నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటికే మండలంలోని లాలపల్లి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. ఈ క్రమంలోనే వలసల పరంపర కొనసాగనుందని సమాచారం. మండలవ్యాప్తంగా కారు ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుందని వినికిడి. బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న సంక్షేమం , కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.