• కాంగ్రెస్ పార్టీ నేత అన్నం ప్రవీణ్
  • యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను చూపి తప్పుదోవ పట్టిస్తున్నారు
  • యావత్తు తెలంగాణ సమాజాన్ని అగౌరవరర్చిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని విమర్శ

వేద న్యూ్స్, జమ్మికుంట:

‘ప్రజా పాలన’తో ముందుకెళ్తూ..ప్రజల ప్రేమ పొందుతున్న కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ ఉద్యమ విద్యార్థినేత, కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థి, కాంగ్రెస్ పార్టీ నేత అన్నం ప్రవీణ్ తెలిపారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పూర్తిగా మతి స్థిమితం కోల్పోయి వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

సోమవారం యాదాద్రిలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను భూతద్దంలో చూస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రవీణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

యావత్తు తెలంగాణ సమాజాన్ని తమ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అగౌరవ పర్చారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నిత్యం ఒంటెద్దు పోకడలతో తెలంగాణ యావత్తు సమాజాన్ని నిర్లక్ష్యం చేసి..ప్రతీ వ్యక్తిని అగౌరవ పరిచిన చరిత్ర కేసీఆర్, గులాబీ పార్టీదని తెలిపారు. బీఆర్ఎస్ వ్యవహార శైలి అందరికీ ఉంటదనుకుంటే ఆ పార్టీ నాయకుల మూర్ఖత్వమేనని అన్నం ప్రవీణ్ ఫైర్ అయ్యారు.

పదేండ్ల అరాచక, అగౌరవ, దౌర్జన్యపు, అన్యాయపు కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకున్నారని వివరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కర్రు కాల్చి వాత పెట్టి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించుకున్నారని వెల్లడించారు. తెలంగాణ సమాజమే తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లకు తగిన బుద్ధి చెబుతుందని అన్నం ప్రవీణ్ హెచ్చరించారు.