- మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్
వేద న్యూస్, వరంగల్ :
బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని..దొడ్డి దారిన కాంగ్రెస్ పార్టీలోకి మేయర్..వచ్చి చేరిందని.. మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ ఘాటుగా విమర్శించారు.వరంగల్ నగరంలోని రామన్నపేట 29వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గుండు సుధారాణి చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే విపరీత ధోరణి గుండు సుధారాణి అని తన వల్ల బీఆర్ఎస్ పార్టీ లో ఎంతో మంది కార్యకర్తల జీవితాలు నాశనం అయ్యాయి అన్నారు.
నిజంగా ప్రజాదరణ ఉన్న నాయకూరలే అయితే మేయర్ వెంట ఒక్క కార్పొరేటర్ ఎందుకు చేరలేదు అని ప్రశ్నించారు. జిల్లాలో ఒక మంత్రి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉండగా ఎవరిని కాదని వెళ్లి కండువా కప్పించకుంటే ఇక్కడ ఊరుకునే వారు ఎవరు లేరు ఇప్పటికే చేసిన తప్పును ఒప్పుకొని వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ, బూత్ కన్వీనర్లు బొమ్మ సురేష్, గొర్రె మహేష్, నల్లగొండ శ్రీనివాస్, మండల వరుణ్, మహిళా డివిజన్ అధ్యక్షురాలు కొలిపాక పద్మ,కందుకూరి అరుణ, గద్వాల కృష్ణవేణి, రాచర్ల సమ్మయ్య, శ్రీరాముల సురేష్,పాకాల లక్ష్యం కేశవరాజు,నరేష్ చంద్రగిరి రమేష్,దౌడు విజయ్ కుమార్, ఏం.డి రఫి, ఎండి రెహమాన్, ముప్పు సతీష్,ఇల్లందుల శశిధర్, ఎండి యాకుబ్ పాషా, బూత్ కన్వీనర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మహిళలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.