వేద న్యూస్, హన్మకొండ :
హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని జిల్లా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఐఎంఎ జిల్లా కార్యవర్గం మాట్లాడుతూ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు , ధీర్ఘ కాళిక వ్యాధుల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రజారోగ్యం బలోపేతం కోసం కృషి చేస్తున్న ఐఎంఎ జిల్లా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఐఏంఏ అధ్యక్షులు డా. కె.నాగార్జున రెడ్డి, కార్యదర్శి డా.అజిత్ మహామ్మద్ , కోశాధికారి డా.శిరీష్ కుమార్, ప్రెసిడెంట్ ఎలక్ట్ డా. మన్మోహన్ రాజ్, టీజీఎంసీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు డా. నరేష్ కుమార్,ఐఎంఎ స్టేట్ కౌన్సిల్ సభ్యులు డా.ప్రసన్న కుమార్ తదితరులు కలిశారు.