వేద న్యూస్, జమ్మికుంట:
స్వాతంత్ర ధీరుడు, పరాక్రమ శీలి, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని, మరణం లేని అమరుడు భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బీజేపీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణారెడ్డి ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ మహావీరుడని మనసారా స్మరించుకోవాలన్నారు. నేతాజీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. భారత దేశ స్వాతంత్రం కోసం నేతాజీ ఎనలేని కృషి చేశారన్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ, ఇతర నేతలు అహింసా వాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేస్తే, సుభాష్ చంద్రబోస్ మాత్రం.. పోరాటం ద్వారానే ఆంగ్లేయను దేశం నుండి తరిమి కొట్టవచ్చని చెప్పారని గుర్తుచేశారు.

నమ్మి అది ఆచరణలో పెట్టిన గొప్ప పోరాట యోధునిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. గాంధీజీ అహింసా వాదం దేశ స్వాతంత్రం కోసం సరిపోదని, పోరుబాట పట్టి ఆంగ్లేయులకు నిద్ర లేకుండా చేశారని, అందుకే ఆంగ్లేయులు 11 సార్లు నేతాజీని… అలాగే నేతాజీ రెండు సార్లు, ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డారని వివరించారు.

అలాగే భారతీయ జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా ఎన్నికైన గాంధీజి తో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల తో ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించారని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో నేతాజీ కీలకపాత్ర పోషించారని ఆయన తెలిపారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం రోజును ‘‘శౌర్య దినోత్సవం’’గా జరుపుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మాడ గౌతమ్ రెడ్డి, జీడి మల్లేష్, పుప్పల రఘు, బింగి కరుణాకర్, చిన్నవేని నరసింహారావు, సంపెల్లి సంపత్ రావు, పల్లపు రవి, దొంతుల రాజకుమార్, పుల్లూరి ఈశ్వర్, గొడుగు వినోద్, మోతే స్వామి, ఇటికాల సరూప, తూడి రవిచంద్ర రెడ్డి, మోడం రాజు తదితరులు పాల్గొన్నారు.