- ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు
వేద న్యూస్, వరంగల్:
75వ గణతంత్ర దినోత్సవాన్ని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె శుక్రవారం మాట్లాడుతూ భారత దేశం అభివృద్ధి లో దూసుకుపోతున్నదని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి కొద్ది రోజుల్లోనే ఆదర్శవంతంగా భారత్ మారబోతుందని తెలిపారు.
ప్రపంచంలోనే అధిక యువత కలిగిన ఏకైక దేశం భారతదేశం అని వెల్లడించారు. రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీ లో పాల్గొంటున్న ఎన్సిసి క్యాడే ట్స్ కు, ఇతర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమానికి ముందు ప్రిన్సిపాల్ గౌరవ వందనం స్వీకరించారు.
ఎన్సిసి నాలుగో ఎయిర్ బెటాలియన్, పదో బెటాలియన్ ,8వ బెటాలియన్ కవాతులు అందరినీ ఆకర్షించాయి. ఎన్సిసి విద్యార్థిల పిరమిడ్లు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, అధ్యాపకులు ఆర్మీ సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.