వేద న్యూస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని ఆర్ ఆర్ గార్డెన్స్ లో పెద్దపల్లి జిల్లా ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్‌టీయూ టీఎస్) సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి , జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గండు కృష్ణమూర్తి, టీచర్స్ యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.