వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్(తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ హాజరయ్యారు.

ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహన్ జర్నలిస్టుల సమక్షంలో జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జై జవాన్.. జై కిసాన్.. వందేమాతరం అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి స్వాతంత్ర్య దినోత్సవమని గుర్తుచేశారు.

దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ, ఖాజాఖాన్, దొడ్డే రాజేంద్రప్రసాద్, కందుకూరి రాజు, దయ్యాల సుధాకర్, అంబాల శ్రీరామ్, రచ్చ రవికృష్ణ, శ్రీరాములు, పెద్ది సంతోష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.