వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం కార్యాలయంలో గురువారం ఆ సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర రావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అడ్తిదారులు, వ్యాపారస్తుల సంక్షేమం కోసం అడ్తిదారుల సంఘం కీలకంగా పనిచేస్తున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి, గుమస్తాలు, దాడ్వాయిలు, వ్యాపారస్తులు, కార్మికులు, మహిళా కార్మికులు  తదితరులు పాల్గొన్నారు.