- ఎల్బీ కాలేజీలో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. బుధవారం ఎన్సిసి గర్ల్స్ క్యాడేట్స్ ప్రిన్సిపాల్ కు పుష్పగుచ్ఛం అందించి.. శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ కు మహిళా టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు.
ప్రముఖ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే భారతదేశం మొదటి మహిళా టీచర్ కావడం వల్ల..సావిత్రిబాయి పుట్టిన దినోత్సవాన్ని ఈరోజు కావున కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా టీచర్స్ డే నిర్వహిస్తుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
సావిత్రిబాయి పూలే అంటరాని వర్గాలకు చేయూతను ఇచ్చి..ఆడపిల్లల చదువును ప్రోత్సహించి వేలాదిమంది నిరుపేదలకు ఆదర్శమూర్తి అయిందని ప్రిన్సిపాల్ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం.సదానందం, ఎన్సిసి క్యాడెట్స్ విద్య, భాగ్యలక్ష్మి, హసియా, నౌషిను, ఆనందిని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.