వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారతరత్న, భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా నెక్కొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి తొలి మహిళా ప్రధాని గా పనిచేసి, ఉక్కు మహిళ గా పేరు తెచ్చుకొని ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలన అందించి, గొప్ప రాజనీతిజ్ఞురాలుగా ఇందిరా గాంధీ నిలిచారని అన్నారు. భారత దేశంలో రాజభరణాలను రద్దుచేసి, బ్యాంకులను పేద ప్రజల కోసం జాతీయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అని, గరీబీ హఠావో నినాదంతో దేశ ప్రజల పేదరికంను పారదోలిన నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు.
కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు, కొల్లి సుబ్బారెడ్డి, ఈదునూరి సాయి కృష్ణ, లావుడియా తిరుమల నాయక్, చల్లా పాపిరెడ్డి, రావుల మహిపాల్ రెడ్డి, కొత్తకొండ గణేష్, మౌటం కృష్ణంరాజు, తాళ్ల పెళ్లి భాస్కర్, పొట్ల పెళ్లి వీరస్వామి, ఎండి అఫ్జల్, వనం ఏకాంతం, బానోత్ శ్రీకాంత్ నాయక్, గట్ల వరుణ్, రమేష్, కందిగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.