వేద న్యూస్, శాయంపేట:
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్ సత్యనారాయణ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను సూపర్ చెక్ చేశారు.
శాయంపేట గ్రామములో మొత్తం 1869 ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అట్టి దరఖాస్తు లను పంచాయితీ సెక్రటరీ రత్నాకర్ మరియు ఇద్దరు ఆంగన్ వాడి టీచర్స్, ఇద్దరు కారోబర్స్ కలిసి ఇప్పటి వరకు 1,659 దరఖాస్తు లు పరిశీలించి, ఫోటోలు తీసి ఆన్ లైన్ చేశారు. అందులో 75 దరఖాస్తు లు సూపర్ చెక్ చేయాలని తహసీల్దార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ 55 దరఖాస్తుల ఇంటింటికీ వెళ్లి తనిఖి చేశారు. ఆయన వెంట పంచాయతీ సెక్రటరీ రత్నాకర్, సిబ్బంది ఉన్నారు.