వేద న్యూస్, జమ్మికుంట:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో గురువారం  ఉమన్ ఎంపవర్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకుని స్త్రీల అనారోగ్య సమస్యలపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ అధ్యక్షత వహించగా, ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బి. మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి.. విద్యార్థినులకు గర్భాశయ వ్యవస్థ నిర్మాణం, అది పని చేసే పద్దతి, నెలసరి రోజుల లో వచ్చే సమస్యలు గురించి వివరించారు. అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగేగర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించడానికి వ్యాక్సినేషన్ గురించి తెలిపారు.

రొమ్ము క్యాన్సరను ముందస్తు గా గుర్తించడానికి తెలుసుకునే పద్దతులు చెప్పారు. రక్త హీనత నివారించడానికి పౌష్టికాహారం తీసుకోవాలని ,అప్పుడే శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయని వెల్లడించారు. విద్యార్థినులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ నుండి విచ్చేసిన డాక్టర్ హారిక,డాక్టర్ అనూష మరియు ప్రతిమ ఫౌండేషన్ కార్యక్రమ సభ్యులు ,గీతారెడ్డి, కౌశిక్,వీరస్వామి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి .సువర్ణ, అధ్యాపకులు డాక్టర్ టి. శ్రీలత, వి .స్వరూప రాణి, ఎన్. మమత, అనూష, ఐక్యవేసి కోఆర్డినేటర్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి, స్టాప్ సెక్రెటరీ డాక్టర్ ఎం. రామ మోహన్ రావు, లైబ్రేరియన్ ఎ. భీమారావు , ఆర్ ఈశ్వరయ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.