వేద న్యూస్, మరిపెడ:
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నరసింహులపేట బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నె 6 వరకు రూ.100 రుసుము చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. వచ్చే నెల (ఫిబ్రవరి) 11న ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులందరూ అప్లై చేసుకోవాలని కోరారు. గురుకులల్లో పుస్తకాలు, దుస్తులు అందజేయడంతో పాటు గ్రంథాలయం, తదితర అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు.

One thought on “గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం”

Comments are closed.