- రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
- మండలంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్ గా ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్
- తక్కువ విద్యార్థులు ఉన్న స్కూల్ టీచర్లను వదిలి.. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ టీచర్‌కు ట్రాన్స్‌ఫర్ ఆదేశాలు
వేద న్యూస్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో 221 మంది విద్యార్థులకు సాంఘికశాస్త్రం బోదిస్తున్న ఉపాధ్యాయురాలిని శుక్రవారం వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా జిల్లా విద్యాశాఖ,అనంతగిరి జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే మండలంలోని గాలిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 150 మంది విద్యార్థులు కు సోషల్ బోధిస్తున్న రెండు సోషల్ పోస్టుల్లో ఒకరైన జూనియర్ ఉపాధ్యాయుడు,కందికట్కూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా 88 మంది విద్యార్థులకు సోషల్ బోదిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు జూనియర్ ఉన్నారు.ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలి కంటే జూనియర్స్ అయినప్పటికీ కూడా వారిని బదిలీ చేయకుండా,సీనియర్ ఉపాధ్యాయురాలును బదిలీ చేయటం వెనుక జిల్లా విద్యాశాఖ,కలెక్టరేట్ లలో పైరవీలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం అవుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వర్క్ అడ్జస్ట్మెంట్ లో సీనియర్స్ ను వదిలి జూనియర్స్ ను మాత్రమే బదిలీ చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి కూడా అవేమి పట్టకుండా బదిలీ చేయటం దారుణం అని పలువురు అంటున్నారు. ఇల్లంతకుంట జడ్పహెచ్ఎస్ పాఠశాలలో 221 మంది విద్యార్థులు మండలంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్ అయినప్పటికీ కూడా ఇక్కడి నుండి బదిలీ చేయటం దారుణం అంటున్నారు.

ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తప్పుడు బదిలీలను నిలిపివేసి,న్యాయపరంగా సీనియర్స్,జూనియర్స్ ను పరిగణలోకి తీసుకుంటూ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.