వేద న్యూస్, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది. గ్రామంలోని సిమెంట్ రోడ్లు డ్యామేజీ అయ్యాయని, రోడ్డు కిరువైపులా గడ్డి తీయడం లేదని ,రోడ్డు మధ్యలో వెళ్లే రహదారికి ఇరువైపులా ఎవరికి వారు ఇష్టానుసారంగా కట్టెలు,చెత్త చెదారం వేసినా.. కంకర రాళ్లు, ఉన్న తీసివేయడంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలాంటి పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

మరి కొద్ది రోజుల్లో బతుకమ్మ, దసర, పండుగలు వస్తున్న నేపథ్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ కోరారు.