• కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు

వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గం లో ‘దళిత బంధు’ పథకం ఆగడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, కావాలనే దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దళిత బంధు’ పథకాన్ని బంద్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలో వాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు దళిత బంధు డబ్బులను విడుదల చేయలేదని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో కావాలనే ‘దళిత బంధు’ డబ్బులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపడం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విధులు సక్రమంగా చేయకుండా చేసి సెలవు పై వెళ్లే విధంగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే అని ధ్వజమెత్తారు. దళిత బంధు డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోల్లు బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, కాంగ్రస్ పార్టీ బిసి సెల్ నియోజకవర్గ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు యేముల పుష్పలత, మైనారిటీ పట్టణ అధ్యక్షులు యండి అఫ్సర్, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, హుజురాబాద్ హనుమాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జి మిడిదొడ్డి రాజు, ఆడేపు ఐలయ్య, బండారి సదానందం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.