- ప్రభుత్వ యంత్రాంగ తీరును ఖండిస్తున్నా
- బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్
వేద న్యూస్, వరంగల్:
తర తరాలుగా, యుగయుగాలుగా హిందూ సంప్రదాయంలో బతుకమ్మ, దసరా, దీపావళి ఉత్సవాలు చెడు పై మంచి
సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించుకుంటున్నామని, అలాంటి ఉత్సవాలకు ఎన్నికల కోడ్ నెపంతో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రంగం ఏర్పాట్లు చేయకపోవడం సరికాదని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు.
ఈ మేరకు హరిశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కుల, మతాలకు అతీతంగా అలాయి బలాయిలతో పండుగలు జరుపుకునే సంస్కృతి ప్రత్యేకంగా వరంగల్ కు ఉన్నదని చెప్పారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వెంటనే స్పందించి ఉత్సవాల ఏర్పాట్లకు అనుమతించి కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులు సహకరించకుంటే బీఆర్ఎస్ పార్టీ నిధులు సమీకరించి బీఆర్ఎస్ ఉత్సవాలుగా నిర్వహించే ప్రమాదముందని హెచ్చరించారు. కమిషనర్ స్పందించి జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు తగు ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, ఈ ఉత్సవాల్లో కూడా అవసరమైన తగు నిబంధనలను విధించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.