వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:

రైతు మిత్ర సమన్వయ సమితి అధ్యక్షులు గూడూరు స్వామి రెడ్డి లోక్సత్తా, కందుగుల గ్రామం మాజీ ఎంపిటిసి కంకణాల సరోజన, మాజీ సర్పంచ్ జనార్ రెడ్డి , ఇప్పల నర్సింగాపూర్ కు చెందిన గూడూరు జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎనిమిదో వార్డ్ మహిళ అధ్యక్షురాలు గూడూరు అధ్యక్షురాలు గూడూరు ఉషానందిని, ఉపాధ్యక్షురాలు గూడూరు వనజ వీణవంక మండలానికి చెందిన రెడ్డి ఐక్యవేదిక కోశాధికారి జున్నోతుల రాజిరెడ్డి, ఉమ్మడి జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు విష్ణుదాస్, గోపాల రావు, సత్యనారాయణ రెడ్డి లతో కలిపి మంది బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.