• కొండగట్టుకు తరలిన జనసైనికులు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
మలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం నుండి జనసేన పార్టీ నాయకులు కొండగట్టుకు శనివారం తరలివెళ్లారు.

తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన గదులు, హనుమాన్ మాలవిరమణ మండపం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ భూమి పూజ చేయడానికి వచ్చారు. ఆయనను కలిసేందుకు జనసేన పార్టీ నాయకులు జిల్లాల మహేష్, ఇంగే శ్రీనివాస్, కుసుంబ శివాజీ, పుల్ల సాయి కుమార్, కుసుంబ సాంబశివ రావు, కాసూరి కృష్ణ,కాసూరి సుమన్ తదితరులు కొండగట్టుకు తరలివెళ్లారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ తరఫున మర్రిపల్లిగూడెం గ్రామ సర్పంచిగా పోటీ చేసిన కంటెస్టెడ్ సర్పంచ్ కాసూరి మమతతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫొటో దిగారు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సౌకర్యార్ధం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ నిధులు వచ్చాయని ఈ సందర్భంగా జనసేన లీడర్లు వెల్లడించారు. భక్తులు, ప్రజల పక్షాన జనసేనానికి జనసేన శ్రేణులు ధన్యవాదాలు తెలిపాయి.