– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్
– ‘జనంతో జనసేన-ప్రజాబాట’కు శ్రీకారం..గాజు గ్లాసుకు ఓటేయాలని అభ్యర్థన

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:
జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని, సామాన్యులకు అండగా ఉంటుందని ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ తెలిపారు. మంగళవారం నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ మండలకేంద్రంలో ‘జనంతో జనసేన- ప్రజా బాట’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గంలో పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా నెక్కొండ మండలకేంద్రంలో ఆ పార్టీ అధ్యక్షులు ఉడుగుల క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకోటి యాదవ్ పాల్గొని ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను చెప్పారు.

పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నియోజవర్గంలో చేసిన ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ‘గాజు గ్లాసు’ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో జనసేన నాయకులు ఓర్సు రాజేందర్, ఎలబోయిన డేవిడ్ రాజ్, రోడ్డ శ్రీకాంత్, బొబ్బ పృథ్వీరాజ్, గద్దల కిరణ్, టేకుల రవి, రణదీప్, అభిషేక్, రవి కిరణ్, అరుణ్ హర్షవర్ధన్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.